![]() |
![]() |

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ 827 లో..... రుద్రాణి డాన్స్ చేస్తూ రేవతి ముసుగు తీస్తుంది. దాంతో రేవతిని చూసి అందరు షాక్ అవుతారు. ఇంత మోసం చేస్తావా అని రుద్రాణి అంటుంటే.. చాలు ఆపు, అసలు రేవతి ఈ కుటుంబానికి దూరంగా ఉండడానికి కారణం నువ్వు కదా అని జరిగిందంతా ఇందిరాదేవి చెప్తుంది. దాంతో రుద్రాణి నోరు మూతపడుతుంది.
ఆ తర్వాత ఇన్ని రోజులు అవుతుంది. దాన్ని క్షమించు.. ఎన్నోసార్లు దానికి సాయం చేద్దామని డబ్బు పట్టుకొని వెళ్ళాము కానీ అది మా అమ్మ నన్ను కూతురుగా ఒప్పుకుంటే చాలు నాకు ఏం వద్దని చెప్పింది.. ఇన్ని రోజులుగా తనకి తనే శిక్ష వేసుకుందని అపర్ణకి ఇందిరాదేవి చెప్తుంది.. అపర్ణ మనసు మార్చాలని ఒకవైపు రాజ్.. ఇంకా కావ్య రేవతి తరుపున మాట్లాడతారు. ఇలా ముసుగులో వచ్చి మోసం చెయ్యడం తప్పు అని రుద్రాణి అనగానే ఆ ముసుగులో ఉంది రేవతి అని నాకు ముందే తెలుసని అపర్ణ అనగానే అందరు షాక్ అవుతారు. ఒకరోజు స్వరాజ్ ని వాళ్ళ ఇంటికి దగ్గర డ్రాప్ చేసాను.. వాటర్ బాటిల్ మర్చిపోతే ఇంటివరకు వెళ్ళాను. అక్కడ నా కూతురిని చూసాను.. తను నన్ను ఎంత మిస్ అవుతుందో.. ఆ రోజు అర్థమైందని అపర్ణ చెప్తుంటే అందరు హ్యాపీగా ఫీల్ అవుతారు.
నేను తప్పు చేసాను అమ్మ అని రేవతి అనగానే ఇన్నిరోజులు దూరం పెట్టి నేను తప్పు చేసానని అపర్ణ అంటుంది. ఇద్దరు హగ్ చేసుకుంటారు. అప్పుడే స్వరాజ్ వస్తాడు. నాకు నిజం ఎందుకు చెప్పలేదని అపర్ణ అడుగగా చెప్తే ఇలా కలిసేవాళ్ళు కాదుగా అని రాజ్ అంటాడు. ఆ తర్వాత కావ్య గురించి అప్పు టెన్షన్ పడుతుంటే కళ్యాణ్ వస్తాడు. తరువాయి భాగంలో కావ్య బిడ్డని మోయకూడదన్న విషయం కావ్యకి అప్పు చెప్తుంది. నాకు బిడ్డ కావాలని ఏడుస్తూ కావ్య కళ్ళు తిరిగిపడిపోతుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
![]() |
![]() |